Site icon NTV Telugu

భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు

Singam Actor Chekwume Malvin smuggling drugs

సాధారణంగా నటీనటుల రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన పాత్రల్లోనే నిజ జీవితంలోనూ జీవిస్తారు. ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన నటుడు రీల్ లైఫ్ లో చేసిన పనిని రియల్ లైఫ్ లోనూ చేసి అందరికీ షాకిచ్చాడు. డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే…

Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింగం’. ఈ సినిమాలో చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు. కట్ చేస్తే ఆయన నిజంగానే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల MDMA, 7 లక్షల విలువైన 250 ml హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్‌లు, ₹ 2,500 నగదు, ఇంకా 8 లక్షల విలువైన డ్రగ్స్ ను అతని దగ్గర నుంచి తీసుకుని సీజ్ చేశారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ అంశం కుదిపేస్తుండగా ఈ ఆర్టిస్ట్ ఇలా పట్టుబడడం గమనార్హం. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎలాంటి సమాచారం రాబడతారో చూడాలి.

Exit mobile version