‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !

కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. మొదట్లో విభిన్నమైన స్పందన వచ్చినప్పటికీ తరువాత లిరిక్స్ అంతా ఫిదా అయిపోయారు. పైగా అందులో అల్లు అర్జున్ చేసిన రెండు మూడు ఐకానిక్ స్టెప్పులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మరోవైపు త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అంతా ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న సినిమా నుంచి హీరోయిన్ రష్మీక లుక్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Read Also : ‘వేటు’ గాళ్ళుగా మారిన రవి, విశ్వ!

అందులో ఆమె నో మేకప్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇందులో రష్మిక పాత్ర పేరు ‘శ్రీవల్లి’ అని, ‘పుష్ప’రాజ్ సోల్ మేట్ అని మేకర్స్ వెల్లడించారు. నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హీరోయిన్ పేరు మాత్రమే కాకుండా సెకండ్ సింగిల్ టైటిల్ కూడా ‘శ్రీవల్లి’గా ఖరారు చేశారని తెలుస్తోంది. అంటే సెకండ్ సింగిల్ హీరోయిన్ పై ఉండే అవకాశం ఉంది. ‘రంగస్థలం’లో కూడా ఇలాగే ‘ఎంత సక్కగున్నావే’ అంటూ సమంతను దిష్టి తగిలేలా చూపించాడు. ఇప్పుడు రష్మికపై కూడా అలాంటి సాంగ్ ఉంటుందని ‘పుష్ప’రాజ్ అభిమానులు ఆశిస్తున్నారు.

-Advertisement-'పుష్ప' సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !

Related Articles

Latest Articles