NTV Telugu Site icon

History of Chatrapati Shivaji’s weapon: 350 ఏళ్ల తర్వాత భారత్ కు తిరిగొచ్చిన శివాజీ ఆయుధం..దాని చరిత్ర ఇదే…

Weapon

Weapon

350 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి ఛత్రపతి శివాజీ ‘ వాఘ్ నఖ్’ (ఆయుధం)న్ని మహారాష్ట్రకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిని మహారాష్ట్ర సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు. రాష్ట్రంలోని మరిన్ని మ్యూజియమ్‌లలో వాఘ్‌నాఖ్‌ను ఎగ్జిబిషన్‌ కోసం ఉంచాలని యోచిస్తున్నారు. ‘ వాఘ్ నఖ్’ అంటే పులి పంజా అని అర్థం. ఇది ఒక రకమైన ఇనుప బాకు లాంటి ఆయుధం. మధ్యయుగ కాలంలో.. వాఘ్ నఖ్ భారతదేశంతో సహా ఉపఖండం అంతటా ఉపయోగించబడింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. వాఘ్ నఖ్ చేతి యొక్క పంజాలో సులభంగా సరిపోయేలా, అరచేతి కింద దాచడానికి వీలుండేలా రూపొందించారు. ఇది నాలుగు-ఐదు కోణాల ఇనుప బ్లేడ్‌లను కలిగి ఉంటుంది. గ్లోవ్ లాంటి స్ట్రిప్‌కు జోడించబడింది.వాఘ్ నఖ్ చాలా ప్రమాదకరమైనది. అది ఒక్క దెబ్బలో ఎవరినైనా చంపగలదు. దీంతో ఛత్రపతి శివాజీ అఫ్జల్‌ఖాన్‌ను చంపేశారు.

READ MORE: Nipah Virus: కేరళలో నిపా కలకలం.. 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్..

అఫ్జల్ ఖాన్ ఎవరు?
అఫ్జల్ ఖాన్ అసలు పేరు అబ్దుల్లా భటారి. పొడుగ్గా ఉండేవాడు. అఫ్జల్ ఖాన్ .. భారతదేశంలోని బీజాపూర్ సుల్తానేట్ ఆదిల్ షాహీ రాజవంశానికి చెందిన జనరల్ గా పనిచేశాడు. ఆదిల్ షాహీ భార్య బడి బేగం. పూర్వపు విజయనగర భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న నాయకులలో ఖాన్ ముఖ్యపాత్ర పోషించాడు. 1656లో ఔరంగజేబు సైన్యం బీజాపూర్‌పై దాడి చేసినప్పుడు.. అఫ్జల్ ఖాన్ దానిని ఎదుర్కోవటానికి బాధ్యత వహించాడు. అతను అనేక యుద్ధాల్లో కూడా గెలిచాడు. జదునాథ్ సర్కార్ తన పుస్తకం ‘శివాజీ అండ్ హిస్ టైమ్స్’లో నవాబ్ మొహమ్మద్… ఆదిల్ షా మరణం తర్వాత బీజాపూర్ సింహాసనం కోసం పోరాటం గురించి ప్రస్తావించారు. అందులో అఫ్జల్ ఖాన్ ఒక పెద్ద శక్తిగా చూయించారు. బీజాపూర్ సింహాసనం పోరాటంలో.. ఆదిల్ షాహీ భార్య బడి బేగం ఆదేశాల మేరకు ముగ్గురు సైన్యాధిపతులను ఒక్కొక్కరిగా చంపేశాడు అఫ్జల్ ఖాన్. గతంలో శాంతిభద్రతల సాకుతో సైరా రాజు కస్తూరి రంగను హత్య చేశాడు.

READ MORE: Ram NRI: ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అంటున్న ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’

శివాజీ మరియు అఫ్జల్ ఖాన్ మధ్య శత్రుత్వం..
ఛత్రపతి శివాజీ మరియు అఫ్జల్ ఖాన్ మధ్య శత్రుత్వం శివాజీ తండ్రి షాహాజీ రాజే భోంస్లే నుంచి మొదలవుతుంది. షాహాజీ రాజే భోంస్లే బీజాపూర్ సుల్తానేట్ వద్ద కూడా పనిచేశాడు. తరువాత.. షాహాజీ రాజే భోంస్లే మరియు అఫ్జల్ ఖాన్ మధ్య విభేదాలు వచ్చినప్పుడు.. అతన్ని బంధించి బీజాపూర్‌కు తీసుకువచ్చారు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళారు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నారు. 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నారు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. పటిష్టమైన ప్రతాప్‌గడ్‌లో ఛత్రపతి శివాజీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శివాజీ ఎదురులేని యోధుడిగా నిలిచారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యారు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టారు. దీంతో బీజాపూర్‌కు చెందిన బడి బేగం భయపడింది. శివాజీని పట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. శివాజీని ఎలుకల పంజరంలో బంధించి బీజాపూర్ తీసుకువస్తానని అఫ్జల్ ఖాన్ హామీ ఇచ్చాడు. 1654లో శివాజీ అన్నయ్య శంభాజీ హత్యలో కూడా అఫ్జల్ ఖాన్ హస్తం ఉంది.

READ MORE:Covid-19: కరోనా వల్ల భారతదేశ ఆయుర్ధాయం 2.6 ఏళ్లు తగ్గిందా..? కేంద్రం ఏం చెబుతోంది..?

అఫ్జల్ ఖాన్ హామీ ఏప్రిల్ 1659 లో..10,000 మంది సైనికులతో తన శివాజీని బంధించేందుకు బయలు దేరాడు. మధ్యలో కనిపించిన దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తూ.. పయాణం సాగించాడు. అఫ్జల్ ఖాన్ ప్రతి చర్య గురించి శివాజీకి తెలుసు. ఛత్రపతి శివాజీకి కంచుకోటగా ఉన్న పూనా వైపు అఫ్జల్ ఖాన్ నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న ఛత్రపతి శివాజీ పూణే నుంచి జావళికి వెళ్లారు. పూణా సమీపంలోకి చేరుకున్న తర్వాత.. అఫ్జల్ ఖాన్ ఒక ట్రిక్ ఆడాడు. తన దూత ద్వారా శివాజీకి సందేశం పంపాడు. “మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. నేను రాజుకు చెప్పి దక్షిణ కొంకణ్‌లో నీకు భూమి, ఆస్తులు ఇప్పిస్తాను. నేను స్వాధీనం చేసుకున్న కోటలను తిరిగి ఇప్పిస్తాను.” అని శివాజీకి సందేశం పంపాడు. అఫ్జల్ ఖాన్ పంపిన సమాచారాన్ని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి మోసుకొచ్చారు. కృష్ణాజీ ద్వారా అఫ్జల్ ఖాన్ ప్లాన్ ఏమిటో తెలుసుకోవడంలో శివాజీ సక్సెస్ అయ్యారు. దీని తర్వాత శివాజీ తన బంటు గోపీనాథ్ పంత్‌తో ఓ సందేశం పంపాడు. “మీరు చూపిన దయకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. మీరు జావళికి వచ్చి ఇక్కడి అడవి వైభవాన్ని చూడండి. దీని వల్ల నా పట్ల మీకున్న సందేహాలు తొలగిపోయి నా గౌరవం కూడా పెరుగుతుంది. నా కత్తిని కూడా నీకు బహుమతిగా ఇస్తాను…” అని అందులో రాశారు.

READ MORE:TGSRTC: రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్కు గుడ్ న్యూస్..

అఫ్జల్ ఖాన్ శివాజీ వలలో చిక్కుకున్నాడు. జావళికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 10 నవంబర్ 1659న, అఫ్జల్ ఖాన్ మరియు ఛత్రపతి శివాజీల మధ్య సమావేశం ప్రతాప్‌గఢ్ కోట క్రింద ఉన్న కొండపై నిర్ణయించబడింది. పథకం ప్రకారం.. అఫ్జల్ ఖాన్ తన సన్నిహిత సైనికులతో కలిసి పల్లకీలో కోట క్రింద ఉన్న గుడారానికి చేరుకున్నాడు. ఛత్రపతి శివాజీని కూడా తనతో పాటు ఎంపిక చేసిన సైనికులను తీసుకురావడానికి అనుమతించారు. వైభవ్ పురందరే తన “శివాజీ: ఇండియాస్ గ్రేట్ వారియర్ కింగ్” అనే పుస్తకంలో ఛత్రపతి శివాజీ మాత భవానీని పూజించిన తర్వాత తెల్లటి బట్టలు ధరించారని రాశారు. దాని చేతికి ఇనుప కవచం ధరించారు. తలకు రక్షణగా తలపాగా దాని కింద ఇనుప టోపీని ధరించారు. అతను తన కుడి చేతి స్లీవ్ కింద ‘బిచ్చువా’ (ఒక రకమైన ఆయుధం) మరియు ఎడమ చేతిలో “వాఘ్ నఖ్” ఎవరూ చూడకుండా దాచారు.

READ MORE:Off The Record: ఆ నేత దూకుడు వెనుక అసలు రహస్యం ఏంటి..?ఆ విషయం పై ఆ నేత వ్యూహం ఏంటి..!

అఫ్జల్ ఖాన్ వాఘ్నఖ్ చేతిలో ఎలా నలిగిపోయాడు?
అఫ్జల్ ఖాన్‌ ఛత్రపతి శివాజీను కౌగిలించుకున్నాడు. అఫ్జల్ ఖాన్ తన ఎడమ చేతితో శివాజీ మెడను పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన శివాజీ కుడిచేత్తో దాడి చేయడం ప్రారంభించారు. శివాజీ కవచం ధరించడం వల్ల ఆయనపై ఎలాంటి ప్రభావం లేదు. ఒక్కసారిగా మెరుపు వేగంతో తిరిగిన శివాజీ ఎడమ మణికట్టును విడిపించుకుని అరచేతిలో దాచుకున్న వాఘ్ నఖ్ తో అఫ్జల్‌ఖాన్‌ను కడుపుభాగంలో పొడిచారు. అఫ్జల్ ఖాన్ అరవడం మొదలుపెట్టాడు. అది విన్న అతనితో పాటు ఉన్న సైనికులు శివాజీ దగ్గరకు పరుగులు తీశారు. అఫ్జల్ ఖాన్ అంగరక్షకులు అతన్ని డేరా నుంచి బయటకు తీసి పల్లకీలో కూర్చోబెట్టి అక్కడి నుంచి పారిపోయారు. దీని తరువాత.. శివాజీ సైనికులు అతనిని వెంబడించి.. పల్లకీ ఉన్న ఖాన్ తల నరికారు. ఈ విధంగా శివాజీ తన తండ్రి అవమానానికి మరియు సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారు.

READ MORE:TGSRTC: రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్కు గుడ్ న్యూస్..

ఛత్రపతి శివాజీ లండన్ వాఘ్ నఖ్ ఎలా చేరుకుంది..
ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ ద్వారా ఛత్రపతి శివాజీ వాఘ్ నఖ్ లండన్ చేరుకుంది. బ్రిటిష్ పాలనలో డఫ్ సతారా జిల్లాలో కంపెనీ ఏజెంట్‌గా ఉండేవాడు. జేమ్స్ గ్రాంట్ డఫ్ వాఘ్నాఖ్‌ను ఎలా స్వాధీనం చేసుకున్నాడు.. అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కొంతమంది చరిత్రకారులు మరాఠాల చివరి పీష్వా, బాజీరావు II, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయినప్పుడు, అతను 1818లో బ్రిటిష్ వారికి లొంగిపోయాడని చెప్పారు. ఈ సమయంలో అతను వాఘ్ నఖ్ డఫ్‌ను అప్పగించారని చెబుతుంటారు. వాఘ్ నఖ్ ను స్వయంగా పేష్వా ప్రధానమంత్రి డఫ్‌కి ఇచ్చారని కూడా చాలా చోట్ల చెప్పబడింది. జేమ్స్ గ్రాంట్ డఫ్ భారతదేశం నుంచి స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు.. అతను తనతో ఈ ఆయుధాన్ని తీసుకువెళ్ళాడు. తరువాత, డఫ్ కుటుంబం దానిని లండన్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చింది.