NTV Telugu Site icon

గుడ్ న్యూస్‌: అక్క‌డ వారంలో నాలుగు రోజులే ప‌ని…

గ్లోబ‌లైజేష‌న్ త‌రువాత సాఫ్ట్‌వేర్ రంగం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింది.  ఒక‌ప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు మాత్ర‌మే వారంలో ఐదు రోజులు ప‌నిదినాలు ఉండేవి.  ఇప్పుడు అనేక రంగాల్లో ప‌నిచేసేవారికి వారంలో ఐదురోజులు మాత్ర‌మే ప‌నిదినాలుగా ఉంటున్నాయి.   అయితే, యూఏఈ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  వారంలో నాలుగున్న రోజులు ప‌నిదినాలుగా, రెండున్న రోజులు సెల‌వుగా ప్ర‌క‌టించింది.

Read: సెల్ఫీ అంటే మ‌రీ ఇంత పిచ్చి ఉంటే ఎలా?

గ‌తంలో శుక్ర‌, శ‌నివారాలు సెల‌వులు కాగా, ఆదివారం ప‌నిదినంగా ఉండేది.  అయితే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం సెల‌వు కావ‌డంతో ప‌నిదినాల్లో మార్పులు చేసింది.  శుక్ర‌వారం ఉద‌యాన్ని ప‌నిదినంగా మార్చి మ‌ధ్యాహ్నం నుంచి సెల‌వు ప్ర‌క‌టించారు. అయితే, షార్జాలో సోమ‌వారం నుంచి గురువారం ప‌నిదినాలుగా శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు సెల‌వులుగా ప్ర‌క‌టించింది. షార్జాలో ఉద‌యం 7:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆఫీసులు ప‌నిచేస్తాయి.