చేతిలో అధికారం ఉండి అభివృద్ధి చేయాలనే బలమైన కోరిక ఉంటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చని నితిన్ గడ్కారి నిరూపించారని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈరోజు అహ్మద్ నగర్‌లోని ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కారీతో కలిసి వేదికను పంచుకున్న శరద్ పవార్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ నగర్‌లో సుదీర్ఘకాలంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని నితిన్ గడ్కారి ఈరోజు ప్రారంభించబోతున్నారని తెలిసి అక్కడికి వచ్చానని అన్నారు. నితిన్ గడ్కారి ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టే నాటికి ఈ ప్రాంతంలో 5 వేల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయని, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ రోడ్లు ఇప్పుడు 12 వేల కిలోమీటర్లకు పెరిగాయని, చేతిలో అధికారం ఉండి పనులు చేయాలని, అభివృద్ధి చేశాలనే సంకల్పం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, దానికి నితిన్ గడ్కారి ఒక ఉదాహరణ అని చెప్పారు.
నితిన్ గడ్కారిపై శరద్ పవార్ ప్రశంసలు… అధికారం ఉంటే…
