బీహార్‌లో బాబాయ్ అబ్బాయ్‌ల‌కు ఈసీ షాక్‌…

బీహార్‌లో ఈనెల 30 వ తేదీన కుషేశ్వ‌ర్ ఆస్థాన్‌, తారాపూర్ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  అయితే, ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్న స‌మ‌యంలో లోక్ జ‌న‌శ‌క్తి పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది.  ఆ పార్టీ పేరును, గుర్తును ప్రీజ్ చేసింది.  ప‌శుప‌తి పార‌స్‌, చిరాగ్ పాశ్వాన్ మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా పార్టీ విష‌యంపై పెద్ద ఎత్తున గొడ‌వ జ‌రుగుతున్న‌ది.  దీంతో ఎన్నిక‌ల క‌మీష‌న్  ఈ నిర్ణ‌యం తీసుకున్నది.  ఆ పార్టీ నుంచి పోటీ చేయాలి అనుకునే అభ్య‌ర్థులకు సంబందించి పార్టీల పేర్ల‌ను, అందుబాటులో ఉన్న గుర్తుల‌ను ఎంచుకొని సోమ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు తెలియజేయాల‌ని పేర్కొంటూ ఈసీ చిరాగ్ పాశ్వాన్‌, ప‌శుప‌తి పార‌స్‌ల‌కు నోటీసులు జారీ చేసింది

Read: బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

-Advertisement-బీహార్‌లో బాబాయ్ అబ్బాయ్‌ల‌కు ఈసీ షాక్‌...

Related Articles

Latest Articles