Site icon NTV Telugu

PM Modi and Sharad Pawar Meet: ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోడీతో శరద్‌ పవార్‌ భేటీ

Sharad Pawar

Sharad Pawar

ఢిల్లీలో జరిగిన ఓ పరిణామం.. మహారాష్ట్రలోని సంకీర్ణంలో హీట్‌ పుట్టించింది.. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. పార్లమెంట్‌లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశంలో మహారాష్ట్ర అధికార సంకీర్ణ నాయకులు మరియు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను లేవనెత్తినట్టుగా తెలుస్తోంది.. మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ బంధువు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ భేటీ జరిగింది.. అసలు ఏ ప్రాతిపదికన సంజయ్ రౌత్‌పై చర్య తీసుకున్నారు? ఇది అన్యాయం.. రౌత్‌పై చర్య తీసుకుని రెచ్చగొట్టడం ఏంటి? అతను కొన్ని ప్రకటనలు చేస్తున్నందునేనా? అంటూ ప్రధాని మోడీ దగ్గర పవార్ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక, ఇవాళ ఉదయం ఎన్‌సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Read Also: Jagga Reddy: రాహుల్‌ గాంధీతో జగ్గారెడ్డి భేటీ.. ఇక సమస్యలే లేవు..!

అయితే, 2019లో శివసేన తన చిరకాల మిత్రపక్షమైన బీజేపీతో విడిపోయిన తర్వాత, శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణంలో ఏదైనా గందరగోళం ఏర్పడిందా? అనే ప్రశ్నను తోసిపుచ్చారు శరాద్ పవార్.. మేం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు.. మహా వికాస్ అఘాడిలో స్థిరత్వం ఉంది.. నేను గత రెండున్నరేళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు.. ఈ భేటీలో కొన్ని నిర్దిష్టమైన అంశాలపైనే మా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని.. లక్షద్వీప్ పై చర్చించేందుకు ప్రధానిని కలిశానన్నారు.. కొన్ని కీలక అభివృధ్ది అంశాల పై చర్చించామన్నారు.. అయితే, రాజకీయ వర్గాల్లో ఈ ఇద్దరు నేతల భేటీ చర్చనీయాంశంగా మారింది.. ప్రతిపక్షాలకు చెందిన నాయకులే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తుందని ఆరోపిస్తూ వస్తున్నాయి శివసేన, ఎన్‌సీపీ.. శాసన మండలికి 12 మందిని నామినేట్ చేయాలంటూ చేసిన సిఫార్సులు గవర్నర్ వద్ద గత కొద్దికాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి.. ఈ అంశాన్ని ప్రధానితో శరద్ పవార్ ప్రస్తావించి ఉంటారని చెబుతున్నారు ఎన్‌సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్… విశేషమేమిటంటే, దేశంలోని అత్యంత సీనియర్ ప్రతిపక్ష రాజకీయ నాయకుల్లో ఒకరైన పవార్‌తో ప్రధానమంత్రి సమావేశం రాష్ట్రపతి ఎన్నికలకు నెలల ముందు కూడా జరిగింది. పదేళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా లేనని మరోసారి నొక్కి చెప్పారు పవార్‌.. నేను యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండటానికి సిద్ధంగా లేను అన్నారు.. ఇక, 2024 జాతీయ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ప్రతిపక్షాలను కూడగట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తారా? అని ప్రశ్నంచగా.. నాకు ఆసక్తి లేదు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

Exit mobile version