Site icon NTV Telugu

దేశంలో ఈ త‌ర‌హా కార్ల‌కే డిమాండ్ ఎక్కువ… ఎందుకంటే…

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు చ‌మురుతో న‌డిచే వాహానాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహానాల‌కు క్ర‌మంగా డిమాండ్ పెరుగుతున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో కొత్త కార్లకు క్ర‌మంగా డిమాండ్ త‌గ్గుతుండ‌గా, పాత కార్ల‌కు అదే రేంజ్‌లో డిమాండ్ పెరుగుతున్న‌ది.  2020-21 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆర్థిక‌ప‌ర‌మైన మార్పుల కార‌ణంగా వినియోగ‌దారులు పాత‌కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  

Read: టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..!

మెగా సిటీల్లోనే కాకుండా ద్వితీయ‌, తృతీయశ్రేణి నగ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల‌కు డిమాండ్ పెరిగింది.  2020-21లో 40 ల‌క్ష‌ల యూనిట్లుగా ఉన్న పాత‌కార్ల మార్కెట్‌, 2025-26 నాటికి 60 ల‌క్ష‌ల యూనిట్‌ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  2030 నాటికి 14.8 శాతం వార్షిక వృద్దితో రూ.5.3 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

Exit mobile version