NTV Telugu Site icon

గుట్టువిప్పిన శాస్త్ర‌వేత్త‌లు: మొద‌టి గుర్ర‌పుస్వారీ మొద‌లైంది అక్క‌డే…

ఇప్పుడు గుర్రాలు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. గుర్రాల‌ను స్వారీ చేయ‌డానికి, ర‌థాలు లాగ‌డానికి, సైనికులు యుద్ధాలు చేయ‌డానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్ర‌న్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్ర‌మే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే కార్లు, బైకులు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత గుర్రాల వినియోగం త‌గ్గిపోయింది. అయితే, పాత రోజుల్లో గుర్రాల‌ను ప్ర‌యాణాల కోసం వినియోగించేవారు. రాజుల కాలం నుంచి వీటి వినియోగం ఉన్న‌ది. అప్ప‌ట్లో మేలుజాతి గుర్రాల‌ను పెంచేవారు. ది గ్రేట్ కింగ్ అలెగ్జాండ‌ర్ గుర్రంపైనే ప్ర‌పంచంలో జైత్ర‌యాత్ర సాగించాడు. అయితే, గుర్రాల వినియోగం ఎప్ప‌టి నుంచి ప్రారంభం అయింది. మొద‌ట‌గా గుర్రాలు ఎక్క‌డ ఉన్నాయి. ఎక్క‌డి నుంచి ప్ర‌పంచం మొత్తం వ్యాపించాయి అనే ప్ర‌శ్న‌కు శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధించి స‌మాధానాలు క‌నుగొన్నారు.

యూర‌ప్‌, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో వెలుగుచూసిన పురాతన గుర్రాల శిలాజాలకు సంబంధించిన 273 జన్యుక్రమాలను ప‌రిశోధించారు. 4200 ఏళ్ల కింద‌ట ఇప్ప‌టి ర‌ష్యా లోని వోల్గా, డాన్ న‌దుల సంగ‌మం వ‌ద్ద మొదట‌గా గుర్రాల‌ను అప్ప‌టి మ‌నుషులు చెలిమి చేసుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని వీరి ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది. సుమారు 4 వేల ఏండ్ల క్రిత‌మే యూర‌ప్‌, ఆసియా దేశాల్లో కాంస్య‌యుగం ప్రారంభం అయింది. కాంస్య‌యుగం ప్రారంభం అయ్యాక మ‌నిషి క్ర‌మంగా విస్త‌రించ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌యాణాలు చేసేందుకు మ‌నిషి గుర్రాల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. గుర్రాల‌పై స్వారీ చేస్తూ ప్ర‌యాణాలు చేశార‌ని, అక్క‌డి నుంచే గుర్రాలు ప్ర‌పంచం మొత్తం క్ర‌మంగా వ్యాపించాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

Read: ట్రెండింగ్‌లో ఇండియా వ‌ర్సెస్ పాక్‌… రికార్డ్ బ‌ద్ద‌ల‌వుతుందా?