Site icon NTV Telugu

వారం పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ప్రధాని మోదీ 4 గంటల పర్యటనకు రూ.23 కోట్ల ఖర్చు

వారం రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరగడంతో సోమవారం నుంచి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. కాలుష్యం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా స్పందించాలన్న న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే లాక్‌డౌన్ పెట్టడంపై కూడా ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version