దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వెస్ట్ బెంగాల్ ఎండలు మండిపోతున్నాయి. వేడి ప్రజలకు అల్లాడిపోతున్నారు. బెంగాల్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో చాలా మంది ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎండలో ప్రయాణించాల్సిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని పాఠశాల బాలికల బృందం ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌ల రూపంలో అందుకున్న డబ్బును ఉపయోగించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించిన కన్యాశ్రీ ప్రకల్ప పథకాన్ని బాలికలు వేసవి రోజున ప్రయాణికులకు షర్బత్ అందించడానికి ఉపయోగించుకున్నారు.
Also Read:Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి
రాజ్ ఖమర్ హై స్కూల్ ఆఫ్ ఇండస్ బ్లాక్ విద్యార్థులు ట్రక్కు డ్రైవర్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎండ వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించారు. హైవేపై అలసిపోయిన ప్రయాణికులకు విద్యార్థులు నిమ్మరసం అందించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బాలికలు నిమ్మరసం కూడా అందించారు. వేసవి తాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రజలు, అలసిపోయిన ప్రయాణికులకు విశ్రాంతిని అందించడానికి తాము చిన్న ప్రయత్నం చేస్తున్నాని దిశాని అనే విద్యార్థి చెప్పారు. ఇందుకోసం కన్యాశ్రీ పథకం కింద ఇచ్చిన డబ్బును ఉపయోగించామని ఆమె వెల్లడించింది.
కన్యాశ్రీ ప్రకల్ప పశ్చిమ బెంగాల్‌లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలికలకు స్కాలర్‌షిప్ పథకం. ఈ స్కాలర్‌షిప్ డ్రాపౌట్ రేటును తగ్గించడం, బాలికలలో ముందస్తు వివాహాలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, బాలకలు చేస్తున్న సేవపై పోలీసులు ప్రశంసించారు. “ఈ యువతులది పెద్ద హృదయం. వాళ్ళు చేసేది అనూహ్యంగా ఉంది” అని ఒక పోలీసు అధికారి చెప్పారు.