Site icon NTV Telugu

Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

Joe Biden

Joe Biden

తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో కొందరు సినీ నటులపై పంచ్‌లు వేస్తుంటారు. హస్యం కోసమే కొన్ని సెటైర్లు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంగా అవి వివాదాస్పదంగా మారిన సందర్భంగాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ టీవీ ఛానల్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ చేసిన ఓ స్కిట్ చర్చనీయాంశమైంది.
Also Read: PM Modi: బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లతో కూడిన పేరడీ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. సుదీ అరేబియా యొక్క ప్రభుత్వ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడిన ఈ స్కిట్‌లో అమెరికా అధ్యక్షుడు బిడెన్ యొక్క నిజ జీవిత చర్యలను సరదాగా చేశారు. బిడెన్ దిన చర్యలను, ఆయన హావ భావాలతో స్కిట్ రూపొందించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని, బిడెన్‌ ఏ విధంగా ఉంటారో చూపించారు. విమానం ఎక్కుతూ మెట్లపై ప్రెసిడెంట్ జారి పడిపోవడం లాంటివి ఉన్నాయి.

వీడియోలో నటుడు మిస్టర్ బిడెన్ ప్రసంగాన్ని ముగించినట్లు, వైట్ హౌస్ వద్ద పోడియం నుండి ఊపుతున్నట్లు కూడా చూపించారు. ప్రజలను నమస్కరిస్తూ పోడియం నుండి దిగి, రెండు అడుగులు ముందుకు వేసి, మరొకరికి చేయి చాచాడు, అక్కడ ఎవరూ లేరని గ్రహించారు. అనంతరం ఆయన కమలా హారిస్‌ ను అనుకరించారు. వైస్ ప్రెసిడెంట్ సరైన దిశలో మార్గనిర్దేశం చేశారు. ఈ వీడియోను పేరడీగా హాస్యభరితంగా రూపొందించారు.

Also Read:DC vs MI WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్‌ ఢీ.. రేపే ఫైనల్ పోరు..

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జో బిడెన్ మరియు కమలా హారిస్‌లను అపహాస్యం చేస్తూ సౌదీ ఛానెల్ స్కెచ్‌ను ప్రసారం చేయడం గత సంవత్సరంలో అతనిది రెండోసారి. ఈ వీడియో 6 లక్షల 64,000 కంటే ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలాగే 14,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా, నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అధ్యక్షుడిని అవమానించే విధంగా రూపొందించారని మండిపడుతున్నారు.

Exit mobile version