NTV Telugu Site icon

మాదిపాడు విషాదంపై స్వరూపానందేంద్ర ఆవేదన

ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి మేము సుముఖంగా వున్నామన్నారు. సంగం సమీపంలోని బీరా పేరు వాగులో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. అతడిని ఫుల్లయ్య (50) గా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా వుంటే నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది కృష్ణానది. ఈత కోసం వెళ్ళినవారు తిరిగి ప్రాణాలతో వస్తారన్న గ్యారంటీ లేకుండా పోతోంది. పదులసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.