పండక్కి ఊరెళుతున్నారా? అయితే రైళ్ళన్నీ ఫుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగ అంటే పిల్లలు పెద్దలకి ఎంతో సరదా. ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వేరే ఊళ్లలో వుండేవారు స్వంతూళ్ళకు వెళతారు. బంధువులు, కుటుంబ సభ్యులతో వారం గడిపేస్తారు. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. గోదావరి జిల్లాల వారైతే కోడిపందేలతో మజా చేస్తారు. సంక్రాంతి వంటకాలతో కడుపారా తింటారు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి సందడి ఎక్కువగానే వుండేలా వుంది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ళుగా సంక్రాంతిని ఎంజాయ్ చేయలేనివారు ఈసారి సంక్రాంతికి ఊరెళదామనుకుంటున్నారు.
అయితే, సంక్రాంతి పండక్కి ఊరెళదామంటే కుదిరేలా లేదు. 50 రోజుల ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. చాలా రైళ్ళు చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ తో కనిపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి, గౌతమి, గరీబ్ రథ్ వంటి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత వుంది. ఫలక్‌నుమా, ఎల్టీటీ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లలో పరిమితి దాటి ‘రిగ్రెట్’కు చేరింది. ఈసారి సంక్రాంతికి స్వస్థలాలకు బయల్దేరేవారు, జనవరి 9 ఆదివారం కావడంతో అంతకు ముందురోజు నుంచి ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. జనవరి 8 నుంచి 10-12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్ ఉంది. 13వ తేదీ కూడా టికెట్లు దొరకడంలేదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉందని టికెట్ రిజర్వేషన్ల కోసం వచ్చినవారు చెబుతున్నారు. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు లేవు. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగానే ఉంది. పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడంతో అటు నుంచి వచ్చే రైళ్లలోనూ రద్దీ బాగా వుందని తెలుస్తోంది.
సికింద్రాబాద్-విశాఖ మార్గంలో 10 రైళ్ళున్నాయి. వాటిలో జనవరి 11న 9, 12న అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. కాకినాడకు 11, 12 తేదీల్లో ఏ క్లాస్‌లోనూ టికెట్లు లేవు. ఎల్టీటీ విశాఖపట్నం, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లలో థర్డ్ ఏసీలో టికెట్లకు అవకాశమే లేదు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్‌లో 472, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 327 వెయిటింగ్ లిస్టు నడుస్తోంది. ఇంత వెయిటింగ్ లిస్ట్ తో ప్రయాణాలు కష్టమే. ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు ప్రయాణికులు.
కోవిడ్ కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ బాగా సాగడంతో సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ కారణంగా అదనపు ఛార్జీలతో నడిపిన ప్రత్యేక రైళ్లను కొవిడ్‌కు ముందు మాదిరిగానే సాధారణ ఛార్జీలతో నడుపుతుండటం రైలు టికెట్లకు డిమాండ్‌ను పెంచుతోంది. రైల్వే శాఖ అదనపు రైళ్ళు వేయాల్సిన అవసరం వుందంటున్నారు ప్రయాణికులు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!