Site icon NTV Telugu

వేధిస్తున్న చిప్స్ కొర‌త‌… దూకుడు పెంచిన శాంసంగ్‌..

మొబైల్, కంప్యూట‌ర్ల‌లో వినియోగించే చిప్స్‌ను తైవాన్‌, చైనాలో త‌యారు చేస్తుంటారు.  యూర‌ప్‌, అమెరికాతో స‌హా అనేక దేశాలు తైవాన్‌లో త‌యారు చేసే చిప్ప్ మీద‌నే ఆధార‌ప‌డుతున్నాయి.  క‌రోనా కాలంలో వీటి ఉత్ప‌త్తి త‌గ్గిపోయింది.  అంతేకాదు, ప్ర‌పంచ దేశాల‌కు ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోవ‌డంతో చిప్స్ ఎగుమ‌తులు ఆగిపోయాయి.  యాపిల్‌, గూగుల్ తో పాటు అనేక కంపెనీలు ఇప్పుడు సొంతంగా చిప్స్‌ను త‌యారు చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.  ఇప్ప‌టికే సొంతంగా ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.  

Read: లైవ్‌: తిరుపతి, నెల్లూరుకు పొంచిఉన్న మరో వానగండం

కాగా, ఇప్పుడు శాంస‌న్ కూడా ఈ దిశ‌గా అడుగులు వేసింది.  ద‌క్షిణ కొరియా టెక్ దిగ్గ‌జ‌మైన శాంసంగ్ అమెరికాలోని అస్టిన్‌లో భారీ చిప్స్ కంపెనీని నెల‌కొల్పేందుకు సిద్ద‌మ‌యింది.  దీనికోసం 17 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఆస్టిన్‌లో ఇప్ప‌టికే ప్లాంట్ నిర్మాణం జ‌రుగుతున్న‌ది.  భ‌విష్య‌త్తులో చిప్స్ కోసం మ‌రో కంపెనీపై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా వాటిని త‌యారు చేసుకోవ‌డ‌మే కాకుండా అవ‌స‌ర‌మైతే ఇత‌ర టెక్ కంపేనీల‌కు కూడా వీటిని ఎగుమ‌తి చేసేదిశ‌గా అడుగులు వేస్తోంది శాంసంగ్‌.  

Exit mobile version