ప్రేమించడం, విడిపోవడం చుట్టే తిరిగిన సామ్, చై సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ సినిమాలే కావటం విశేషం.. అంతేకాదు, వీరి సినిమాలు కూడా ప్రేమించటం, విడిపోవటం చుట్టే తిరిగాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో సమంత తెరకు పరిచయం అయింది. ఈ సినిమా నుంచే చైతన్య-సమంత ప్రేమలో పడగా.. చాలా కాలం వరకు మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ సినిమా ఇద్దరికి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమా తరువాత వీరిద్దరూ తిరిగి వెనక్కిచూసుకోలేదు. వీరిద్దరికి ఇష్టమైన సినిమా కూడా ఇదే కావటం విశేషం..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఇక వీరిద్దరూ కలిసిన నటించిన మరో చిత్రం ‘ఆటో నగర్ సూర్య’.. వసూళ్లపరంగా ఈ సినిమా కాస్త నిరాశపరిచిన.. వీరిద్దరిని నటన పరంగా పరిణితి చెందేలా చేసింది ఈ సినిమా.. దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భిన్నమైన సినిమాగా గుర్తిండిపోయింది.
అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన సినిమా ‘మనం’.. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, చైతన్య, అఖిల్ కలిసి నటించారు. ఓ రకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో భాగమైన సమంత కూడా పెళ్లి కాకముందే నటించడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం ఇదే.. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు.
ఇక ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణలతో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘మజిలీ’.. ఈ సినిమాలో సమంత నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. భర్త (నాగచైతన్య) మనసుకు తగిలిన ప్రేమ గాయం మాని ఏనాటికైనా తనపై ప్రేమ కురిపిస్తాడని భార్య (సమంత) పడే నిరీక్షణ సినిమాలో హైలైట్ పాయింట్ గా నిలిచింది.. భావోద్వేగ సన్నివేశాలు.. బలమైన డైలాగ్స్‌తో దర్శకుడు శివ నిర్వాణ మంచి ఫీల్‌ను కలిగించాడు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!