NTV Telugu Site icon

Salaar Teaser : ‘సలార్’ టీజర్ వచ్చేసింది..ఏం మాస్ రా మామా.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలే..

Salar Teaser

Salar Teaser

పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు.. ఊరమాస్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం తో ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సహం తో ఉన్నారు..

సలార్ టీజర్ టైం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సలార్ సినిమా ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుందనేది అంచనా. అందుకే సలార్ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి..తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. ప్రభాస్ మాస్ లుక్ లో అదరగోట్టారు.. కే. జీ. ఎఫ్ మించిన యాక్షన్ ఇందులో ఉన్నట్లు టీజర్ లో చూపించారు.. టీజర్ లో డార్లింగ్ దుమ్ము దూళిపాడు..ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. KGF లో హీరోకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివర్లో వేశారు. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.. సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీని తర్వత NTR 31 మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మరో ఆరు నెలలకి పైగా టైం పడుతుంది..అప్పటివరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైనా సలార్ టీజర్ మాత్రం ఇంటర్నెట్ షేక్ చేస్తుంది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Show comments