ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీఎస్‌ఆర్టీసీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సజ్జనార్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం… ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్వయంగా సమస్యలు తెలుసుకోవడం… ఇలా ఒకట్రెండు కాదు.. ఎన్నెన్నో వినూత్న చర్యలను సజ్జనార్ చేపడుతున్నారు. గతంలో పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపించిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం.
Read Also: రికార్డుస్థాయికి వంకాయ ధర.. మార్కెట్‌లోనే కిలో రూ.100..!
తాజాగా సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి భద్రత గురించి తెలిపేందుకు ఇలా తన ఫ్యామిలీతో కలిసి ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కారు. తద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం, క్షేమం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బస్సులో తన ఫ్యామిలీతో కలిసి ఆట, పాటలతో హాయిగా గడిపారు సజ్జనార్. ఈ సందర్భంగా సజ్జనార్ స్టెప్పులు కూడా వేశారు. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు మీరూ ఓ లుక్కేయండి.