NTV Telugu Site icon

విద్యుత్ వినియోగంపై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…

దేశంలో విద్యుత్ వినియోగం పెర‌గ‌డంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొర‌త ఏర్ప‌డింది.  విద్యుత్ కొర‌త ఏర్ప‌డ‌టంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేస్తున్నాయి.  ఏపీలో విద్యుత్ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు.  రాష్ట్రంలో విద్యుత్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని, రాబోయే రోజుల్లో అధికారికంగా విద్యుత్ కోత‌లు విధించాల్సి రావొచ్చ‌ని స‌జ్జ‌ల పేర్కొన్నారు.  ప్ర‌జ‌లు వారి ఇళ్ల‌ల్లో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించుకోవాల‌ని కోరారు.  సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య విద్యుత్ వినియోగం పెరుగుతుంద‌ని, ఆ మ‌ధ్య‌కాలంలో వినియోగించే విద్యుత్‌ను కొంత‌మేర త‌గ్గించుకోవాల్సి ఉంటుంద‌ని స‌జ్జ‌ల పేర్కొన్నారు.  దేశంలో బొగ్గుకొర‌త‌, ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల‌నే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని స‌జ్జ‌ల తెలిపారు.  

Read: స్కూటీలోకి దూరిన పాము… ఎలా బ‌య‌ట‌కు తీశారంటే…