స్కూటీలోకి దూరిన పాము… ఎలా బ‌య‌ట‌కు తీశారంటే…

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు ఓ మూడు అడుగుల విష స‌ర్పం ఒక‌టి బ‌ర‌బ‌రామ‌ని వ‌చ్చి పార్కింగ్ చేసిన స్కాటీలోకి దూరింది.  అలా స్కూటీలోకి దూరిన ఆ పామును బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు అక్క‌డ ఉన్న జ‌నం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేశారు.  పామును బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు నీళ్లు కూడా పోశారు.  అయిన‌ప్ప‌టికి ఆ పాము బ‌య‌ట‌కు రాలేదు.  ఎంత ప్ర‌య‌త్నించినా పాము బ‌య‌ట‌కు రాక‌పోడంతో రెస్క్యూ టీమ్‌కు స‌మాచారం అందించారు.  వెంట‌నే వ‌చ్చిన స్నేక్ రెస్క్యూ టీమ్ రెండు గంట‌ల‌కు పైగా శ్ర‌మించి స్కూటి ఒక్కోపార్ట్‌ను ఊడదీసి పామును బ‌య‌ట‌కు తీశారు.  మూడు అడుగులున్న ఈ విష‌స‌ర్పం అక్క‌డున్న వారిని భ‌య‌పెట్టింది.  రెస్క్యూ టీమ్ ఆ పామును అక్క‌డి నుంచి తీసుకెళ్లి స‌మీపంలోని అడ‌విలో వ‌ద‌లేశారు.  ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని హోషంగ‌బాద్‌లో జ‌రిగింది.  

Read: విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…

-Advertisement-స్కూటీలోకి దూరిన పాము... ఎలా బ‌య‌ట‌కు తీశారంటే...

Related Articles

Latest Articles