Site icon NTV Telugu

సింగరేణి కాలనీ ఘటన.. స్థానికులపై క్రిమినల్‌ కేసులు..!

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలమే రేపింది.. వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి.. అయితే, నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడడంతో.. అంతా సద్దుమణిగింది.. అయితే, సింగరేణి కాలనీలో స్థానికులపై కేసు నమోదు చేశారు సైదాబాద్‌ పోలీసులు.. ఈ నెల 10వ తేదీన పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురిపై కేసులు నమోదైంది… చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకున్నారు స్థానికులు.. ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లను కూడా రువ్వారు.. ఈ ఘటనలో పలువురు మహిళ పోలీసు సిబ్బందికి గాయాలు అయ్యాయని చెబుతున్నారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సైదాబాద్‌ పోలీసులు.. పలువురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

Exit mobile version