Site icon NTV Telugu

ర‌ష్యాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభ‌ణః మూడో డోసు వ్యాక్సినేష‌న్ ప్రారంభం…

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.  గ‌త రెండేళ్లుగా క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది  క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా పెరుగుతున్నాయి.  ప్ర‌పంచంలో మొద‌ట‌గా క‌రోనాకు వ్యాక్సిన్ ను త‌యారు చేసిన ర‌ష్యా ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది.  అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ దేశంలో మ‌ర‌లా కేసులు పెరుగుతున్నాయి.  

Read: తెలకపల్లి రవి : చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం – చారిత్రక ప్రభావం

దీంతో మూడో డోస్ ను ఇచ్చేందుకు ర‌ష్యా సిద్దం అయింది.  జులై 1 వ తేదీ నుంచి రెండు డోసులు తీసుకున్న వారికి బూస్ట‌ర్ డోస్‌ను ఇస్తున్నారు.  రెండో డోస్ తీసుకొని ఆరు నెల‌ల త‌రువాత మూడో డోస్ ఇవ్వ‌నున్నారు.  అంతేకాదు, ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని పుతిన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రెండు డోసుల త‌రువాత కూడా కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

Exit mobile version