Site icon NTV Telugu

తెలంగాణ ప్రజలకు షాక్.. పెరగనున్న ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆదుకునేందుకు ప్రజలపై భారం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు తీసుకున్న అప్పులను ఆర్టీసీ తీర్చలేక అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేవారంలో ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read Also: త్వరలో మరో రూ.100 పెరగనున్న పెట్రోల్ ధర?

ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలే ఒకవైపు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలతో అల్లాడుతున్న ప్రజలు.. ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల భారంతో వాళ్లు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version