Site icon NTV Telugu

Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

Rohit Dance

Rohit Dance

భారత క్రికెట్ జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బీజీగా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలో భాగంగా భారత్- ఆసీస్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా జట్టు బాధ్యతను అప్పగించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సరిగ్గా రోహిత్ ఆట ఎందుకు మిస్ అవుతున్నాడో వెల్లడించనప్పటికీ, అతని వ్యక్తిగత కారణంతోనే దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. బావమరిది పెళ్లిలో రోహిత్ శర్మ డ్యాన్స్ చేస్తున్నాడు. రితికా సోదరుడి వివాహ వేడుకలో భాగంగా రోహిత్‌ స్నేక్‌ డ్యాన్స్‌ ఇరగదీశాడు. భార్య రితికాతో కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Lift Accident in VTPS: వీటీపీఎస్‌లో లిఫ్ట్‌ ప్రమాదం.. ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ పాల్గొనలేదు. రెండో, మూడో మ్యాచ్‌కి తిరిగి రానున్నాడు. రోహిత్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఆసీస్ తో ఆడిన తొలి వన్డే మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. పాండ్యా సేన జట్టు 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Also Read:World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

Exit mobile version