Site icon NTV Telugu

టీమిండియాలో రోహిత్ శర్మ స్పెషల్.. ఎందుకంటే..?

టీమిండియా జట్టులో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడిపై చాలా అంచనాలున్నాయి. అయితే అతడు చాలా స్పెషల్. ఎందుకంటే 2007లో టీమిండియా ఆడిన ప్రపంచకప్ జట్టులో.. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఒకేఒక్కడు రోహిత్ మాత్రమే. 2007లో 20 ఏళ్ల వయసులోనే రోహిత్ ప్రపంచకప్ ఆడాడు. అప్పుడు జట్టులో అతడే యువకుడు. ఇప్పుడు మాత్రం అతడు సీనియర్.

Read Also: పాక్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు : కోహ్లీ

2007 ప్రపంచకప్‌లో ఆడిన దిగ్గజ ఆటగాళ్లు ధోనీ, హర్భజన్, గంభీర్, యువరాజ్ ఇప్పటికే రిటైర్ అయ్యారు. రోహిత్ మాత్రం ఓపెనర్‌గా దుమ్ముదులుపుతున్నాడు. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ చేసిన అతడు ఫైనల్‌లో పాకిస్థాన్‌పై విలువైన 30 పరుగులు చేశాడు. ఇప్పుడు మరోసారి పాక్‌ను చిత్తు చేయాలంటే హిట్ మ్యాన్ చెలరేగడం చాలా అవసరం. కాగా పాకిస్థాన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకే ఎక్కువ అభిమానులు ఉన్నారంట. అందుకే రోహిత్‌ను పాకిస్థాన్ అభిమానులు ఇండియాకా ఇంజమామ్ అని ముద్దుగా పిలుస్తారంట.

Exit mobile version