జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్‌లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయం అల్లర్ల నిరోధక పోలీసులు ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు చీఫ్ ప్రభాత్ కుమార్ తెలిపారు. గుమిగూడిన వారిని ఇంటికి పంపించారు. మొత్తం ప్రాంతంలో బలగాలను మోహరించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంపెనీని మోహరించారు.
Also Read:Maharashtra: ప్రాణం తీసిన చెట్టు.. వృక్షం నేలకూలి ఏడుగురు దుర్మరణం
మరోవైపు అల్లర్ల ఘటనకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు సింగ్‌భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ జాదవ్ తెలిపారు. తాము పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితిని తీసుకురావడానికి శాంతి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు పౌరుల నుంచి సహకరించాలని ఆమె కోరారు. తాము తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఇతర అల్లర్ల నిరోధక వనరులను శాంతిభద్రతలను కాపాడటానికి నియమించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read:Jail Restaurant: బెంగళూరులో సెంట్రల్ జైల్ రెస్టారెంట్.. ప్రత్యేక ఏంటో తెలుసా ?
పుకార్లను నమ్మవద్దని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అభ్యర్థించారు. ప్రజలకు ఏవైనా రెచ్చగొట్టే లేదా అసహ్యకరమైన సందేశాలు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శనివారం నుంచి స్థానిక సంస్థ సభ్యులు రామనవమి జెండాను అపవిత్రం చేసినట్లు గుర్తించడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి మంటలు చెలరేగడంతో, పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ చేస్తున్నారు.