Site icon NTV Telugu

బీసీలకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది : రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల కులగణన చేస్తామని, బీసీల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

బీసీల లెక్కలను తీయడంలో ఎందుకు మోడీ ప్రభుత్వం భయపడుతోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మర్చిపోయారని ఆయన అన్నారు. జనాభా లెక్కలు తేల్చితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, అవకాశం వచ్చినప్పుడు బీసీల బిల్లు గురించి సభలో ప్రస్తావిస్తానని రేవంత్‌ అన్నారు. కొట్లాడి మన బీసీ బిల్లును సాధించుకుందామని, చరిత్రలో బలహీన వర్గాలకు స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version