Site icon NTV Telugu

దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారు : రేవంత్‌రెడ్డి

నెక్లెస్ రోడ్డులో స్ఫూర్తి స్థల్‌లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

జైపాల్ రెడ్డి ఆశయాలుకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయని ఆయన తెలిపారు. రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపుల, కొనుగోళ్ళు, కాంట్రాక్ట్ లు గా కేసీఆర్ చేశారని, జైపాల్ రెడ్డి స్ఫూర్తిని మేము కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. పీవీ, మర్రి చెన్నా రెడ్డి సరసన నిలిచే నాయకులు జైపాల్ రెడ్డి అంటూ రేవంత్‌ కొనియాడారు.

Exit mobile version