NTV Telugu Site icon

మూసారంబాగ్ వంతెన‌పై కొన‌సాగుతున్న ఆంక్షలు… వాహ‌నాల‌కు ఇక్క‌ట్లు…

గ‌త నాలుగు రోజులుగా హైదరాబాద్ నగ‌రంలో వ‌ర్షాలు కురుస్తున్నాయి.  మ‌రో రెండు రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టుగా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.  ఎగువ ప్రాంతంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో హిమాయ‌త్ సాగ‌ర్‌, ఉస్మాన్ సాగ‌ర్‌ల‌కు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతున్న‌ది.  ఈ వ‌ర‌ద కార‌ణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు అధికారులు.  దీంతో మూసి న‌దికి పెద్ద మొత్తంలో వ‌ర‌ద వ‌చ్చి చేరుతున్న‌ది.  ఈ వ‌ర‌ద కార‌ణంగా న‌గ‌రంలోని మూసారంబాగ్ వంతెన‌ను మూసివేశారు. మూసిన‌దిలో వ‌ర‌ద ఉధృతి త‌గ్గుముఖం ప‌డితే వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.  వంతెన‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

Read: ఇండియా క‌రోనా అప్డేట్‌: భారీగా త‌గ్గిన కేసులు…