బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కి రాంచీ కోర్టు షాక్ ఇచ్చింది. మోసం, చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి కృనాల్‌పై రాంచీ సివిల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడు అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత. అతను అమీషా పటేల్, ఆమె భాగస్వామిపై మోసం, బెదిరింపు, చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఆమెపై CRPC సెక్షన్ 420, 120 కింద కేసు నమోదు చేశారు.
Also Read:Navjot Sidhu: రాహుల్ గాంధీని కలిసిన నవజ్యోత్ సిద్ధూ.. కాంగ్రెస్ నేత నేతృత్వంలో విప్లవం
సమన్లు జారీ చేసినా నటి కోర్టు ముందు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమిషా గానీ, ఆమె లాయర్ గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 15న జరగనుంది. దేశీ మ్యాజిక్ అనే సినిమా మేకింగ్, పబ్లిసిటీ కోసం నటి అమిష పటేల్ తోపాటు ఆమె వ్యాపార భాగస్వామి తన నుంచి రూ.2.5 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదుదారు అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి సినిమా పూర్తయిన తర్వాత వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇస్తామని చెప్పారు. దేశీ మ్యాజిక్ షూటింగ్ 2013లో మొదలైంది.. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. చిత్రనిర్మాత అమీషా పటేల్ నుండి తన డబ్బును అడిగినప్పుడు, ఆమె అతనికి తిరిగి చెల్లించలేదు. అయితే, చాలా రోజుల తర్వాత, ఆమె 2018 అక్టోబర్‌లో రూ. 2.5 కోట్లు, రూ. 50 లక్షలకు రెండు చెక్కులను ఇచ్చింది. అయితే, అది బౌన్స్ అయింది.
