వరంగల్ రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్ గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా.. ఇండియా నుంచి 2020 ఏడాదికి రామప్పకు మాత్రమే ఈ స్థానం దక్కింది. రామప్పకు అంతర్జాతీ గుర్తింపు రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక రామప్ప ఆలయం అని మోడీ కొనియాడారు.
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
