NTV Telugu Site icon

Rajinikanth : తలైవా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఒకే సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్..!

Amitab Rajini

Amitab Rajini

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను గడుపుతున్నారు. ఇక జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తలైవా రజినీకాంత్..వివిధ భాషల స్టార్స్‌ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు.. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్‌ అనే కాదు మల్టీస్టారర్‌ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకే ఉంటుంది.

ఇదిలా ఉండగా.. ఇద్దరు లెజెండరీ నటుల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో మూవీ రూపొందనుంది. తలైవా 170వ సినిమాలో బిగ్‌బీ నటించనున్నారని సమాచారం.. ఈ విషయాన్ని రజనీకాంత్‌ స్వయంగా వెల్లడించాడు. 33 ఏళ్ల తర్వాత తన గురువు బిగ్‌బీతో కలిసి నటించబోతున్నట్లు పేర్కొన్నాడు. తనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్విటర్‌లో రాసుకొచ్చాడు..

జైలర్ తర్వాత రజినీకాంత్ జై భీమ్‌ ఫేమ్‌ టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్‌ తదితరులు నటించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నాడు. ఇకపోతే బిగ్‌బీ, తలైవా చివరగా 1991లో వచ్చిన హమ్‌ సినిమాలో కనిపించారు.. మళ్లీ ఇప్పుడు నటించడం తో తలైవా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. రజినీకాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..