జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నలుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేయనుంది. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:TSRTC: ఆర్టీసీ ప్రయాణికులపై భారం.. బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలు
ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేస్తుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ కేసులో హాజరయ్యేందుకు నియమించబడిన అదనపు అడ్వకేట్ జనరల్ రాజేంద్ర యాదవ్ సేవలను కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
Also Read:Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే
అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించిన అనంతరం జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకోబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ న్యాయవాదులను నిమాయకం చేయడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆనంద్‌కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read:ChatGPT: ఇటలీలో చాట్‌జీపీటీపై తాత్కాలిక నిషేధం
కాగా, 2008లో సంచలనం రేపిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ రాజస్థాన్ హైకోర్టు బుధవారం(మార్చి 29) నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి 2019లో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఆ తీర్పును నిందితులు హైకోర్టులో వారు సవాల్ చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్‌ల ధర్మాసనం.. నిందితులను నిర్దోషులుగా తేల్చి వారి ఉరిశిక్షను రద్దు చేసింది. కాగా, మే 13, 2008న జైపూర్ లో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 71 మంది మృతి చెందగా, 185 మంది గాయపడ్డారు. మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహమాన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సల్మాన్‌లను హత్య, విద్రోహం, పేలుడు పదార్థాల చట్టంలో దోషులుగా కోర్టు నిర్ధారించింది.