NTV Telugu Site icon

Rain Alert: మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Rains 1

Rains 1

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణం మారింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసాయి.

మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి వ్యాపించిందని తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read:GT vs MI: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దని సూచించారు. రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్ల కింద ఉండొద్దు.. దయచేసి అప్రమత్తంగా ఉండండి.

ఉత్తర కోస్తా, యానాంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.దక్షిణ కోస్తాలో బుధ, గురువారాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో కూడా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
Also Read:Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

Show comments