Site icon NTV Telugu

Rain Forecast: తెలంగాణకు వర్ష సూచన.. వడగళ్ల వానలు కురిసే అవకాశం

Ts Rains

Ts Rains

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 25,26,27 తేదీల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ద్రోణి రాయలసీమ నుంచి
Also Read: AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌.. టీడీపీ అభ్యర్థి విజయం

తెలంగాణ మీదుగా దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు రైతలు తీవ్రంగా నష్టపోయారు. వేల సంఖ్యలో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:Vidyut Jammwal: ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసిన హీరో.. మీకు అలవాటే కదా..?

మరోవైపు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

Exit mobile version