ఈసారి వర్షాలు వేసవిలోనూ మనల్ని పలకరించనున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ గాలుల వల్ల ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఎత్తైన ప్రదేశం నుండి 7.6 కి.మీ, ఇది బీహార్ నుండి దక్షిణ కర్ణాటక వరకు చత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఈ నెల 16న తూర్పు భారతం మీదుగా మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో గాలుల దిశ మారుతుంది.
Also Read:Revanth Reddy : కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా?
ప్రస్తుతం రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశను మార్చి దక్షిణం నుంచి వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం 4 రోజుల పాటు ఉంటుంది. దీని ప్రభావంతో 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం తన బులెటిన్‌లో పేర్కొంది.
Also Read:Delhi Liqour Scam: కవితకు మళ్లీ ఈడీ నోటీసులు.. 16న విచారణకు ఎమ్మెల్సీ
అదే సమయంలో క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా చోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు (గరిష్టంగా) నమోదవుతున్నాయి. రానున్న ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో వేడిగాలులకు కొంత ఉపశమనం లభించనుంది.
సాధారణంగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు పశ్చిమ ద్రోణుల ప్రభావంతో మధ్య భారతం, దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుంటాయని అధికారులు తెలిపారు.