గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి రోజున 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారంటే అర్థం చేసుకొవచ్చు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండిపోవడంతో నీటికి దిగువ ప్రాంతాలకు వదులుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద పోటెత్తింది. నదీ ఉగ్రరూపం దాల్చడంతో నదీపరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, నదీ ప్రవాహ ఉదృతికి ఓ భారీ భవంతి కొట్టుకుపోయింది. చూస్తుండగానే ఇల్లు నదిలో కొట్టుకుపోయిన ఇంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
കേരളം മാറി ചിന്തിക്കേണ്ടിയിരികുന്നു. പ്രകൃതിയെ മറന്നുള്ള ഈ പോക്ക് അപകടകരം. അനധികൃത കരിങ്കൽ ക്വാറികളും പാടങ്ങൾ നികത്തിയുള്ള കെട്ടിടനിർമ്മാണവും അശാസ്ത്രീയ വികസന മാതൃകകളും തുടർച്ചയായ പ്രളയത്തിലും ഉരുൾപൊട്ടലിലുമാണ് കലാശിക്കുന്നത്. pic.twitter.com/84A1qszXLr
— K Surendran (@surendranbjp) October 17, 2021
Read: తాజా పరిశోధన: 1.40 లక్షల మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్…