Site icon NTV Telugu

భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌: వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ఇల్లు…

గ‌త మూడు రోజులుగా కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా ఈ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  నిన్న‌టి రోజున 7 జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారంటే అర్థం చేసుకొవ‌చ్చు.  ర‌హ‌దారులు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి.  ఇక న‌దులు ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్ర‌వ‌హిస్తున్నాయి.  జ‌లాశ‌యాలు నిండిపోవ‌డంతో నీటికి దిగువ ప్రాంతాల‌కు వ‌దులుతున్నాయి.  దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  ముంద‌కాయం ప్రాంతంలోని మ‌ణిమాల న‌దికి వ‌ర‌ద పోటెత్తింది.  న‌దీ ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో న‌దీప‌రివాహ‌క ప్రాంతంలోని గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.  కాగా, న‌దీ ప్ర‌వాహ ఉదృతికి  ఓ భారీ భ‌వంతి కొట్టుకుపోయింది.  చూస్తుండ‌గానే ఇల్లు న‌దిలో కొట్టుకుపోయిన ఇంటి దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  

Read: తాజా ప‌రిశోధ‌న‌: 1.40 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్‌…

Exit mobile version