అలర్ట్ : తెలంగాణకు మరో 3 రోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా-పశ్చిమ బెంగాల్ తీరానికి 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి వీస్తాయని పేర్కొంది. రాగల 3 రోజులు (20,21,22వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు : రాగల 3 రోజులు (20,21,22వ తేదీలు) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం గంటకి 30 నుండి 40 కిమి)తో కూడిన వర్షం.. అలాగే తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read
- Tags
- rain
- telangana
- three days
- weather
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!