NTV Telugu Site icon

బూస్ట‌ర్ డోసుల‌పై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…

దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లుదాటిన వృద్దుల‌కు బూస్ట‌ర్ డోసులు అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.  బూస్ట‌ర్ డోసుల‌పై తాను ఇచ్చిన సల‌హాను కేంద్రం స్వీక‌రించిందని, ఇది మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నారు.  బూస్ట‌ర్ డోసుల ర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రికి చేరాల‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  

Read: పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్

ఈనెల 22 వ తేదీన వ్యాక్స‌న్ డోసుల‌పై ట్వీట్ చేశారు.  దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ ఇంకా పూర్తికాలేద‌ని, ఎప్ప‌టి వ‌ర‌కు పూర్త‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి అని, మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తే దాని వ‌ల‌న స‌మ‌స్య‌లు తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తిచేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌ని, ఇక ఎప్పుడు బూస్ట‌ర్ డోసులు అందిస్తారని ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు. కాగా, త‌న స‌ల‌హాను కేంద్రం స్వీక‌రించింద‌ని, మంచి నిర్ణ‌య‌మ‌ని రాహుల్ చెప్పుకొచ్చారు.