కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పాలనపై పట్టు తప్పుతోంది. మెడికల్ విద్యార్థుల మధ్య సమన్వయం చేస్తూ ఉత్తమ బోధన చేయాల్సిన ప్రొఫెసర్లు అధిపత్యపోరులో మునిగి తేలుతుండడంతో మెడికల్ విద్యార్థుల్లో వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి.. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య ఏకంగా గొడవ చోటు చేసుకుంది. కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది.
హాస్టల్-1లో సీనియర్ల అనుచిత ప్రవర్తన పైన మోదీ, కేటీఆర్ కు ట్వీట్ చేశాడో మెడికో. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మరోసారి ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఓ విద్యార్థి ఏకంగా ప్రధాన మంత్రి మోడీకి..కేటీఆర్ కి ట్విటర్ వేదికగా చేసిన ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కేఎంసీలో రెండు రోజుల కిందట విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేసుకున్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
దీనికి నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించారు. ఈసందర్భంగా నిర్వహించిన వేడుకలో సుమారు 50 మంది పాల్గొన్నారు. అక్కడ వారీ మధ్య గొడవ జరిగింది. మూడో సంవత్సరం విద్యార్ధులు తమను గౌరవించడం లేదని, తగిన మర్యాద ఇవ్వడం లేదని సీనియర్లు ఆగ్రహించినట్టు తెలి సింది. ఈనేపథ్యంలో ఆదివారం ట్విటర్ వేదికగా ఓ విద్యార్థి పలు ఆరోపణలు చేశాడు. “కేఎంసీలో ర్యాగింగ్ తరహా చాలా ఘటనలు జరుగుతున్నాయి.
దయచేసి కాపాడండి. వారంతా తప్ప తాగి జూనియర్ మెడికోల పట్ల అనుచితంగా వ్యవ హరిస్తున్నారు. ఇదంతా వరంగల్ కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో జరుగుతోంది. దయ చేసి కాపాడండి” అని కోరాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీ, వరంగల్ సీపీతోపాటు మరో 8 మందిని ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేశాడు. ఇది కేఎంసీ తీరును చెప్పకనే చెబుతుంది. ఈ సంఘటన పైన మట్టేవాడ పోలీసులు న్యూమెన్స్ హాస్టల్లో ఏం జరుగుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. ట్విటర్లో చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా విచారణకు సిద్ధపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!