Site icon NTV Telugu

Raccoon Dogs at Wuhan Market: రాకూన్ కుక్కలే కరోనాకి దారి తీశాయా?

Covid 11

Covid 11

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలా మందిని పొట్టనపెట్టుకుంది కరోనా. క‌రోనాకు పుట్టిల్లు అయిన చైనాలో నేటికి కరోనా వ్యాప్తి ఉంది. రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారిలో, SAR-CoV-2 వైరస్ ఎలా ఉద్భవించిందో మనకు ఇంకా తెలియదు. ఇది ల్యాబ్, వుహాన్ మార్కెట్ నుండి ఉద్భవించిందని అనేక నివేదికలు ఉన్నాయి. అయితే, కరోనాకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. చైనాలోని వుహాన్‌లోని మార్కెట్ నుండి జన్యు డేటాను కనుగొన్నట్లు అంతర్జాతీయ వైరస్ నిపుణుల బృందం పేర్కొంది.

Also Read:Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి

వుహాన్‌లోని హువానాన్‌ టోకు చేపల మార్కట్‌ నుంచి కొవిడ్‌ వైరస్‌ వ్యాపించిందనే అనుమానంతో చైనా అధికారులు 2020 జనవరిలో ఆ మార్కెట్‌ను మూసివేశారు. ఆ సమయంలో చైనా శాస్త్రజ్ఞులు మార్కెట్‌ నుంచి జన్యు నమూనాలను సేకరించారు. జంతువులకు చెందిన జన్యు పదార్థాన్ని కనుగొంది. ఇందులో పెద్ద మొత్తంలో రకూన్ కుక్కకు సరిపోతుందని పరిశోధనలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు తెలిపారు. జన్యు నమూనాలో రాకూన్‌ కుక్క న్యూక్లిక్‌ ఆమ్లం, వైరస్‌ న్యూక్లిక్‌ ఆమ్లం కలిసి ఉన్నాయని కనిపెట్టారు. ఒకవేళ రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకినా దాని నుంచి అది నేరుగా మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చనీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవుల ద్వారానే కుక్కకు వైరస్‌ సోకి ఉండవచ్చనీ చెబుతున్నారు. లేదా మరేదైనా జంతువు నుంచి కూడా రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ వుహాన్ ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చని అమెరికా అంచనా వేసిన కొన్ని వారాలకే దానికి విరుద్ధమైన అంచనాను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెలువరించడం గమానార్హం.

Also Read:Fire accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్..!

కరోనా వైరస్ యొక్క మూలాన్ని బహిర్గతం చేసే శాస్త్రీయ పరిశోధనలను నిలిపివేసినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అధికారులను మందలించింది.WHO శుక్రవారం (స్థానిక కాలమానం) కూడా మూడు సంవత్సరాల క్రితం డేటాను బహిర్గతం చేయకపోవడానికి గల కారణాల గురించి చైనా అధికారిని అడిగింది.

Exit mobile version