పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంతర్గత సమస్యతను పక్కన పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను లేఖలో పేర్కొన్నారు. ఈ పాయింట్ల ఆధారంగా మ్యానిఫెస్టోను రూపొందించేందుకు సమయం కావాలని కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీకి బాధ్యతలు అప్పగించారు. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన సిద్ధూ ఆ తరువాత తిరిగి పీసీసీ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్య, వ్యవసాయ చట్టాలు, సమస్యలు, ఉద్యోగావకాశాలు, విద్యుత్తు, పీపీఏ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, మహిళా సాధికారికత, మద్యం, ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్ మాఫియా తదిత అంశాలను లేఖలో పొందుపరిచారు.
పంజాబ్‌లో వేడెక్కిన రాజకీయం… దూకుడు పెంచిన సిద్దూ
