తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో కోసం అంబులెన్స్ వెనుక వేలాదిమంది అభిమానులు ఫాలో అయ్యారు. అభిమానుల ఆందోళన దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ కూడా ప్రకటించింది. థియేటర్లను కూడా మూసివేయాలని ఆదేశించింది.
Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను దానం చేసిన పునీత్
Also Read
పునీత్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంఠీరవ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఆయన తండ్రి రాజ్‌కుమార్ సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు కూడా జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ లాంఛనాలను ప్రభుత్వం తరఫున నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్‌ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!