NTV Telugu Site icon

Project K: ప్రాజెక్ట్ కె అప్డేట్..హాలీవుడ్ రేంజ్‌లో దీపిక లుక్..

Project K

Project K

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ప్రాజక్ట్ కె నుండి నేడు హీరోయిన్ దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో దీపికా పదుకొనె నాచురల్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ప్రాజెక్ట్-కె ఈ సంవత్సరం శాండియాగో కామిక్ కాన్ లో ప్రదర్శించబడే మొదటి భారతీయ చిత్రంగా ఇప్పటికే గొప్ప పేరు సొంతం చేసుకుంది. విడుదలకు ముందే అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని జూలై 21, 2023న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..

ప్రాజెక్ట్ K యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్ చూసి అటు దీపికా అభిమానులతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ చెందారు. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీన్ని అప్డేట్ అంటారా? ఈ పాస్ పోర్ట్ ఫోటో కోసం మళ్ళీ నాలుగు గంటలు లేట్? అసలు ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ అభిమానులు ప్రాజెక్ట్ K మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక జులై 21న రిలీజ్ చేయబోయే టైటిల్, గ్లింప్స్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..