NTV Telugu Site icon

Project K : Project K నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Projectk

Projectk

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి.. ఈ సినిమా పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్..రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ప్రాజెక్ కె’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ సహా పలువురు స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు..

ఈ సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో భారీ విజువల్స్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటివరకు దాదాపు 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా కమల్ హాసన్ కూడా సినిమాలో భాగమని ప్రకటించారు.. గత కొద్ది రోజులుగా ఈ మూవీటీమ్ వరుసగా సర్ ప్రైజెస్ లు ఇస్తోంది. రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపింది. దీంతో ఆ వేదికపై ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్‌ కె చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 20న ప్రారంభం కానున్న కామిక్‌ కాన్‌ – 2023 వేడుకల్లోనే సినిమా పేరు, ట్రైలర్‌ను ఆవిష్కరించి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్​ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా Project K నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్‌ ను ఈ నెల 21న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. 20వ తేదీన అమెరికాలో గ్లింప్స్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..