Project K : Project K నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి.. ఈ సినిమా పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్..రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ప్రాజెక్ కె’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ సహా పలువురు స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు..
ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో భారీ విజువల్స్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటివరకు దాదాపు 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా కమల్ హాసన్ కూడా సినిమాలో భాగమని ప్రకటించారు.. గత కొద్ది రోజులుగా ఈ మూవీటీమ్ వరుసగా సర్ ప్రైజెస్ లు ఇస్తోంది. రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపింది. దీంతో ఆ వేదికపై ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 20న ప్రారంభం కానున్న కామిక్ కాన్ – 2023 వేడుకల్లోనే సినిమా పేరు, ట్రైలర్‌ను ఆవిష్కరించి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
- Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
- Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా Project K నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ ను ఈ నెల 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. 20వ తేదీన అమెరికాలో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
The world awaits the ultimate showdown.
Brace yourselves for a glimpse into the world of #ProjectK on July 20 (USA) & July 21 (INDIA).Stay tuned and Subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms… pic.twitter.com/MMc60mrHxH
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2023
తాజావార్తలు
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్‌తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..