ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వారం రోజులపాటు పర్యటించబోతున్నారు. సోమవారం నుంచి అమె వారం పాటు పర్యటనకు సంబందించిన షెడ్యూల్‌ను ఖరారుచేశారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రియాంకగాంధీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేతలతో ప్రియాంక గాంధీ వరసభేటీలు జరపబోతున్నారు. కీలక నేతలతో ఆమె మంతనాలు జరపనున్నారు. 2022 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకారు, కాంగ్రెస్ ప్రతిజ్ఞయాత్ర పేరుతో రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 12వేల కిలోమీటర్లపాటు యాత్ర చేయాలని పార్టీ చూస్తున్నది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ యాత్రను నిర్వహించబోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పేందుకు ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నారు.
Read: పాక్ మంత్రి ఫవాద్ చౌదరీపై మళ్లీ ట్రోలింగ్… ఇదే కారణం…
