Site icon NTV Telugu

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు కొనసాగించాలి: ప్రధాని మోదీ

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు.

Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు

మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను కొనసాగించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. పలు దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో భారత్ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కొత్త వేరియంట్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పాల్గొన్నారు.

Exit mobile version