NTV Telugu Site icon

Prashanth Neel : సలార్ కోసం సూపర్ ప్లాన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

Salar

Salar

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోంది సలార్ మూవీ. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలుహుబలితో ఇండియన్ స్టార్ మారాడు ప్రభాస్. ఇక కేజీఎఫ్‌ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అంటే మాములుగా ఉండదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తున్న సల్లార్ మూవీ.. తొందరలో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. కేజీఎఫ్‌ మూవీని నిర్మించిన హోంబ్యానర్‌ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సాలార్ కోసం యాక్షన్ సీక్వెన్స్‌లతో పెద్దగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. సాలార్ యాక్షన్ సన్నివేశాల కోసం హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ కేటాయించింది.
Alsor Read:TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్‌లో శృతిహాసన్‌ కీ రోల్‌లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ద‌క్షిణాదిభాష‌ల‌తో పాటు హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేయాలని డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. సినిమా రిలీజ్ కంటే ముందే సలార్ కోసం భారీ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సమ్మర్‌లో సలార్ మువీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, గ్లింప్స్ వీడియో ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్‌ అనుకుంటున్నాడట. ఓ వైపు సినిమా షూటింగ్ పార్ట్, పోస్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్స్ పూర్తి చేస్తూ ప్రమోషన్ పై కూడా చాలా ఫోకస్ పెట్టాడన్న వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కోడుతోంది. సలార్ రిలీజ్‌కు 3 నెలల ముందు నుంచే ప్రభాస్‌తో కలిసి ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేశాడట డైరెక్టర్. బాహుబలి, కేజీఎఫ్‌తో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో సినిమాకు క్రేజ్ తీసుకురావాలని భావిస్తున్నాడట.